రేవతి మృతితో షాక్కు గురయ్యా: అల్లు అర్జున్ 15 d ago
పుష్ప2 ప్రీమియర్ షోలో మహిళ మృతితో షాక్కు గురయ్యానని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆ వార్తతో పుష్ప2 సెలబ్రేషన్స్లో కూడా యాక్టివ్గా పాల్గొనలేకపోయానని పేర్కొన్నారు. రేవతి కుటుంబానికి అయన ప్రగాఢ సంతాపం తెలిపారు. రేవతి కుటుంబానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం అందిస్తానని., పిల్లలకు ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమేనని అల్లు అర్జున్ వెల్లడించారు.